- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాటరీ పేలి బాలుడు మృతి
by Jakkula.Mamatha |
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలో బ్యాటరీ పేలి బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

X
దిశ, బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలో బ్యాటరీ పేలి బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చింతలమానపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికార్డి లోకేష్(15) బుధవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటూ, గుర్తు తెలియని బ్యాటరీని నోటితో కొరకడంతో బ్యాటరీ పేలి ముఖం, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌కు కుటుంబీకులు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆడుకుంటూ బ్యాటరీ పేలి కుమారుడు చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Next Story






