రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కామారెడ్డిలో కాంగ్రెస్ నిరసన

by Ratna Kumari |

నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కామారెడ్డిలో కాంగ్రెస్ నిరసన
X

దిశ, కామారెడ్డి టౌన్ : ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతల అరెస్టును ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నాయకత్వం వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.

అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ యాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story