- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడంగల్‌లో సీఎం రేవంత్ రికార్డు పర్యటన.. కేంద్రంపై సమరభేరి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రెండు రోజుల పర్యటన అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

దిశ, కొడంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రెండు రోజుల పర్యటన అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. ఒకవైపు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి పై సమీక్షలు, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శల దాడితో రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. పర్యటన ముగింపు సందర్భంగా కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన సభ ద్వారా సీఎం రేవంత్ జాతీయ రాజకీయాల పట్ల కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేశారు.
అంబేద్కర్ చౌరస్తాలో వేడెక్కిన రాజకీయం
పర్యటన చివరి రోజు కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఢిల్లీలో విద్యార్థుల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు ప్రవర్తించిన తీరును సీఎం తీవ్రంగా ఖండించారు. "అంబేద్కర్ రాజ్యాంగం పౌరులకు ప్రశాంతంగా నిరసన తెలిపే హక్కును కల్పించింది. దాన్ని అణిచివేయాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని పూడ్చిపెట్టడమే" అని సీఎం మండిపడ్డారు.
‘నీట్’ బాధితులకు అండగా.. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలి.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళం, 'గ్లోబరీనా' సంస్థ వ్యవహారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఏ ప్రభుత్వానికైనా ఓటమి తప్పదని హెచ్చరించారు.
సమీక్షలు.. అభివృద్ధి మంత్రం!
రెండు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, నియోజకవర్గ అభివృద్ధికే సీఎం తొలి ప్రాధాన్యత ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులు, తాగునీరు, రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.
హైదరాబాద్‌కు పయనం!
నిరసన సభలో ప్రసంగం ముగించిన అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. సీఎం రెండు రోజుల పర్యటనతో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండగా, కొడంగల్ వేదికగా కేంద్రం పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.






