- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్
తెలంగాణలో రబీ వడ్ల కొనుగోలు అంచనాను కేంద్రం 43 ఎల్‌ఎమ్‌టీలకు పెంచింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం శుభార్త చెప్పింది. రాష్ట్రంలో అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రబీ సీజన్‍కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులు(బియ్యం రూపంలో) పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సవరించిన అంచనా ప్రకారం మొత్తం 43 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వాహనాల లొకేషన్ ట్రాకింగ్‍ను సెప్టెంబర్ నాటికి పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించింది. వడ్ల కొనుగోలు అంచనాను పెంచినందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‍కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ పార్లమెంట్‍లో పీయూష్ గోయల్‍ను కలిసి తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వడ్ల కొనుగోలు అంచనాను పెంచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Next Story






