- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన.. అంతా బాగున్న ఆ విషయంలో తప్పని టెన్షన్
'దేవర పార్ట్ 2' ఉంటుందని ఎన్టీఆర్ చెప్పిన ఇప్పటికి షూటింగ్ ప్రారంభం కాకపోవడం అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'డ్రాగన్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. వరుసగా క్రేజీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో తారక్ అభిమానులు ఆనందంలో ఉన్నారు. అయితే ఒక విషయంలో మాత్రం వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అదే 'దేవర పార్ట్ 2'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'దేవర' తొలి భాగం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. సినిమా విడుదలైన కొంతకాలానికి 'దేవర పార్ట్ 2' ఉండకపోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే ఆ ప్రచారానికి స్వయంగా ఎన్టీఆర్ చెక్ పెడుతూ 'దేవర పార్ట్ 2' తప్పకుండా వస్తుందని స్పష్టం చేశారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు 'దేవర పార్ట్ 2' షూటింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు దర్శకుడు కొరటాల శివ, బాలకృష్ణతో తన తదుపరి చిత్రానికి కమిట్ కావడంతో, 'దేవర 2' ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలు రెండో భాగానికి లీడ్ ఇస్తూ ముగుస్తున్నాయి. మొదటి భాగం విజయవంతమైతే వెంటనే సీక్వెల్‌ను ప్రారంభిస్తుండగా, కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయి. 'దేవర' విడుదలైన తర్వాత వచ్చిన కొన్ని సినిమాల సీక్వెల్స్ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాయి. కానీ 'దేవర పార్ట్ 2' విషయంలో ఎలాంటి అధికారిక అప్డేట్ లేకపోవడంతో తారక్ అభిమానుల్లో మరోసారి ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.






