మొబైల్ షాపులో చోరీ

by Jakkula.Mamatha |

మండల కేంద్రంలోని స్థానిక వేపచెట్టు సెంటర్లో ఒక మొబైల్ దుకాణంలో చోరీ జరిగింది.

మొబైల్ షాపులో చోరీ
X

దిశ, వెంకటాపురం(నూగూరు): మండల కేంద్రంలోని స్థానిక వేపచెట్టు సెంటర్లో ఒక మొబైల్ దుకాణంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి ఎవరూ లేని సమయంలో దుకాణంకి ఉన్న షట్టర్ వంచి లోనికి ప్రవేశించి షాప్ లో ఉన్న నగదు, విలువైన సెల్ ఫోన్లు చోరీ చేశారు. ఈ ఒక్క దుకాణంలోనే కాకుండా ఇంకా నాలుగు దుకాణాల్లో చోరీకి యత్నించినట్లు సమాచారం. విషయం పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story