- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో కరోనా కలకలం.. సైలెంట్‌గా పాకుతున్న మహమ్మారి?
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూలై 1 నుండి ఇప్పటి వరకు దేశంలో మూడు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు పక్కరాష్ట్రం ఏపీలోనూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూలై 1 నుండి ఇప్పటి వరకు దేశంలో మూడు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు పక్కరాష్ట్రం ఏపీలోనూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే ఏడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తై టెస్టుల సంఖ్య పెంచింది. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారికి టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చినవారిని ఐసోషలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో వస్తున్న కేసులకు ఒమిక్రాన్ వేరియంట్ కారణమని నిర్దారించారు. ఇదిలా ఉంటే తెలంగాణలోనూ కరోనా వైరస్ సైలెంట్ గా పాకుతుందనే అనుమానాలు మొదలయ్యాయి.
గతనెల హైదరాబాద్ లోని తార్నాకకు చెందిన 38ఏళ్ల మహిళ దగ్గు, జలుబు,జ్వరంతో బాధపడుతూ సిటీ స్కాన్ చేయించుకోగా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు గుర్తించారు. వెంటనే ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా ఆమె కొన్ని గంటల్లోనే మరణించారు. రిపోర్టులు పరిశీలించిన ఓ ప్రభుత్వ వైద్యుడు కోవిడ్ కారణంగానే ఆమె మరణించిందని నిర్దారించారు. గత నెలలోనే గాంధీ ఆస్పత్రిలోనూ ఓ కరోనా కేసు నమోదైంది. అయితే పక్కరాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యపై క్లారిటీ లేకపోవడానికి కారణం టెస్టులు చేయకపోవడమే అనే ప్రచారం జరుగుతోంది.
జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలతో చాలా మంది ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రులకు వస్తున్నప్పటికీ టెస్టులు నిర్వహించకపోవడం వల్లనే కరోనా బయటపడటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే కేసులు ఉన్నప్పటికీ ప్రజారోగ్యవిభాగం కరోనా కేసుల సంఖ్య సున్నా చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కిట్లు లేకపోవడం వల్లనే టెస్టులు నిర్వహించడంలేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం లేకపోవడంతో గత నాలుగేళ్లుగా ప్రభుత్వం టెస్టు కిట్లు, మాస్కులు, శానిటైజర్లు కొనుగోలు నిలిపివేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఆరోగ్యశాఖ కరోనా టెస్టు కిట్లను అందుబాటులోకి తెచ్చి టెస్టులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.






