- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నో డేటింగ్.. నో మ్యారేజ్.. జెన్ Z ‘సింగిల్’ మంత్రం..!
ఇటీవల అర్థవంతమైన, నాణ్యమైన బంధాలు దొరకడం కష్టంగా మారిందని జెన్ Z భావిస్తోంది!

దిశ, ఫీచర్స్ : మునుపటి తరాలు లేదా మిలీనియల్స్‌తో పోలిస్తే.. జెన్ Z (Gen Z) యువతలో ఎక్కువ కాలం సింగిల్‌గా ఉండడం, వివాహాన్ని వాయిదా వేయడం లేదా సాంప్రదాయ బంధాలపై అనాసక్తిగా ఉండటం వంటి మార్పులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. డేటింగ్ యాప్‌ల వాడకం, ఆర్థిక ఒత్తిళ్లు, వ్యక్తిగత ఎదుగుదల, కెరీర్‌కే తొలి ప్రాధాన్యం ఇవ్వడం వంటివి ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. దీనికితోడు, సింగిల్ జీవితాన్ని స్వేచ్ఛకు చిహ్నంగా భావిస్తూ చాలామంది దానికే మొగ్గు చూపుతున్నారు.
వ్యక్తిగత ఆనందమే కారణమా?
స్వేచ్ఛ, స్వతంత్రత, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో కొందరు డేటింగ్, పెళ్లి వంటి విషయాలను వాయిదా వేస్తుంటే.. మరికొందరు వాటికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు అర్థవంతమైన, నాణ్యమైన బంధాలు దొరకడం కష్టంగా మారిందని భావిస్తున్నారు. మరోవైపు డేటింగ్ యాప్‌లలో లభించే పైపైన సంబంధాలు, ఆర్థిక-సామాజిక ఒత్తిళ్ల వల్ల మరికొందరు విసిగిపోతున్నారు.
అయితే జెన్ Z ఇలా చేయడం నిజంగా స్వేచ్ఛను ఆస్వాదించడమా? లేక తక్కువ ప్రమాణాలు (Low Standards) ఉన్న బంధాల్లో కాంప్రమైజ్ కాకూడదనే నిర్ణయమా? అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఏదేమైనా, సాంప్రదాయ సంబంధాలు, వైవాహిక బంధాలపై నేటి యువత ఆసక్తి తగ్గుతోందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.






