- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ధర్నా..
కమాన్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.

దిశ, కమాన్‌పూర్: కమాన్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి రాస్తారోకోను విరమింపజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సుల కొరత తీవ్రంగా ఉందని, రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా..
ఆసుపత్రి ఆవరణలోని సిబ్బంది క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారాయని పేర్కొన్నారు. కమాన్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ఆసుపత్రి ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ శంకర్, యూత్ మండల మాజీ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, మాజీ జడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, నాయకులు గాదె సదయ్య, రాచకొండ రవి, దండే కిషన్, బోయిని బాలకృష్ణ, ఎలాబోయిన రామ్మూర్తి, తోట రాజు కుమార్, పెండ్లి నారాయణ, పంతకాని రవి, భూపెల్లి మల్లేష్, కొయ్యడ రవి తదితరులు పాల్గొన్నారు.






