- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ అరెస్టు పై కాంగ్రెస్ ఆందోళన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ, నీట్ (NEET) పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్‌లో కాంగ్రెస్ నాయకులు బుధవారం శాంతియుత నిరసన చేపట్టారు.

దిశ, మేడ్చల్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ, నీట్ (NEET) పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్‌లో కాంగ్రెస్ నాయకులు బుధవారం శాంతియుత నిరసన చేపట్టారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ ఘటనతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కాంగ్రెస్ పార్టీ వాటిని తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మైపాల్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్, బాల్‌రెడ్డి, అధికార ప్రతినిధి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ బీపీటీ రాజు, కిష్టాపూర్, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్ డివిజన్ అధ్యక్షులు చాప రాజు, మల్లేష్ గౌడ్, సురేందర్ ముదిరాజ్, డబిల్‌పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు విఘ్నేశ్వర్ రెడ్డి, మేడ్చల్ మాజీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మాజీ మున్సిపల్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ మండల మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి, మాజీ వైస్‌చైర్మన్ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






