- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతులు పరార్.. సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
by Jakkula.Mamatha |
నిజం జీవితంలో ప్రజలకు ఉన్న సమస్యల్లో ప్రధాన సమస్య కోతుల బెడదా.

X
దిశ, మంథని: నిజం జీవితంలో ప్రజలకు ఉన్న సమస్యల్లో ప్రధాన సమస్య కోతుల బెడదా. అయితే ఓ సర్పంచ్ కోతుల బాధ నుంచి ప్రజలను రక్షించడానికి ఓ మహిళ సర్పంచ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో కోతులు దండుతో వచ్చి ఇండ్లలోకి దూరి ప్రజలను గాయపరుస్తున్నాయి. ఇండ్లలోకి దూరి వస్తువులను ఎత్తుకెళ్లుతున్నాయి. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించడానికి సర్పంచ్, పాలక వర్గం వినూత్న కార్యక్రమం చేపట్టారు. చింపాంజీ వేషధారణలో గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలో వాడ వాడ తిరుగుతూ.. కోతులను తరిమి కొడుతున్నారు. దీన్ని చూసి కోతులు పారిపోతున్నాయి. గ్రామ సర్పంచ్, పాలక వర్గానికి ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
Next Story






