- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లామర్ డోస్ పెంచిన మానస వారణాసి.. సోషల్ మీడియాలో హల్‌చల్
స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మానస వారణాసి గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేని అందం.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణకు చెందిన ప్రముఖ నటి మానస వారణాసి మోడలింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఫెమినా మిస్ ఇండియా 2020 కిరీటాన్ని సొంతం చేసుకున్న ఆమె, 2021లో ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి టాప్-10లో చోటు దక్కించుకుంది.
ఆ తర్వాత 2024లో విడుదలైన దేవకీ నందన వాసుదేవ చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, ఇటీవల విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని తన నటనకు ప్రశంసలు అందుకుంది.
ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మానస వారణాసి తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పూల డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉన్న లైట్ పింక్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఆమె ఎంతో స్టైలిష్‌గా కనిపించింది. మెడలో సింపుల్ చైన్, చేతికి బ్లాక్ కలర్ వాచ్ ధరించి, సహజంగా వదిలేసిన జుట్టుతో మరింత గ్లామర్ టచ్ ఇచ్చింది.
వివిధ యాంగిల్స్‌లో ఇచ్చిన స్టైలిష్ పోజులు ఆమె అందాన్ని మరింత హైలైట్ చేయగా, ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






