- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల భవిష్యత్‍తో చెలగాటం ఆడుతామంటే దేశం చూస్తూ కూర్చోదు .. కొడంగల్ ర్యాలీలో రేవంత్ రెడ్డి హెచ్చరిక
శాంతియుతంగా ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని రక్తాలు వచ్చేలా పోలీసులు కొట్టారని, ఈ దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్తేమి కాదని రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేందర్, కేంద్ర మంత్రి ధర్మేందర్ కలిసి ఈ దేశాన్ని లూటీ చేస్తున్నారని లక్షలాది మది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంటే ఈ దేశం చూస్తూ కూర్చోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీట్ (NEET) ప్రశ్నాపత్రాలను పల్లీబఠానీల్లా అమ్ముకున్నారని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‍ను మత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని లేకుంటే సడక్ టు సంసద్ పోరాటం తప్పదన్నారు. ఈ పోరాటాన్ని తెలంగాణ నుంచే ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ కొడంగల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంలో తప్పు చేసిన నిందితులను జైల్లో పెట్టాల్సింది పోయి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు దారుణంగా లాఠీఛార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం పాశవిక చర్య అని మండిపడ్డారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ఆడపిల్లల దుస్తులు చింపేసి, వారిపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీ వారసులు, గాడ్సే వారసులకు మధ్య పోరాటం:
పార్లమెంట్‌లో నీట్ అక్రమాలపై చర్చకు పట్టుబడితే ఉభయసభలను వాయిదా వేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ జరుగుతున్న పోరాటం కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్య కాదని గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని స్పష్టం చేశారు. దేశం కోసం ఇందిరా గాంధీ కుటుంబం ఎంతో రక్తం చిందించిందని, రాజీవ్ గాంధీ చివరి రక్తం బొట్టు వరకు దేశం కోసమే జీవించారని సీఎం అన్నారు. సోనియా గాంధీ ప్రధాని పదవినే త్యాగం చేశారని గుర్తుచేశారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీపై పోలీసులు దాడి చేస్తే రక్తాలు కారాయని, దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదన్నారు.
నాడు బీఆర్ఎస్ నేడు బీజేపీ:
గతంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్లోబరీనా అనే సంస్థ ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని సీఎం ఆరోపించారు. నాడు ఆ సంస్థ చేసిన పొరపాటు వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పుడు అదే సంస్థ కేంద్రంలోని సీబీఎస్ఈ పేపర్ల మూల్యాంకనంలో కూడా పొరపాట్లు చేసిందన్నారు. ఈ తప్పిదాలతో అనేకమంది విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడ్డారని దేశంలో ఏ పరీక్ష జరిగినా దాని వెనుక ఒక కుంభకోణం ఉంటోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ధర్నాలు రాజకీయ డ్రామాలే: రేవంత్ సర్కార్, రాహుల్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ధ్వజం
నాంపల్లి టూ గాంధీభవన్.. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీజేపీ ర్యాలీ






