- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాంపల్లి టూ గాంధీభవన్.. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీజేపీ ర్యాలీ
కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ హైదరాబాద్ లో బీజేపీ నాయకులు ర్యాలీకి సిద్ధం అయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి గాంధీభవన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. బీజేపీ అధ్యక్షడు రాంచందర్ రావు నేతృత్వంలో ఈ ర్యాలీకి పిలపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ హైదరాబాద్ లో బీజేపీ నాయకులు ర్యాలీకి సిద్ధం అయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి గాంధీభవన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. బీజేపీ అధ్యక్షడు రాంచందర్ రావు నేతృత్వంలో ఈ ర్యాలీకి పిలపునిచ్చారు. దీంతో నాంపల్లి బీజేపీ కార్యాలయంతో పాటు, గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బీజేపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీభవన్ మెట్రోస్టేషన్ దగ్గరలో ఉన్న ప్రధాన రహదారిని పోలీసులు పూర్తిగా మూసివేశారు. బీజేపీ నేతలు ర్యాలీగా వస్తే అదుపులోకి తీసుకుని అక్కడ నుండి తరలించేందుకు వ్యాన్ లను సైతం సిద్ధం చేశారు.
మరోవైపు బీజేపీ నాయకులు మాత్రం గాంధీ భవన్ ను ముట్టడించితీరుతామని హెచ్చరిస్తున్నారు. ప్రధాని మోడీ ఇంటిముందు ఆందోళన చేపట్టి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు దేశాన్ని అవమానించారని, అది ప్రజాస్వామానికి మచ్చలాంటిదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఏదైనా ఉంటే చర్చలు జరపాలి కానీ ఆందోళన చేపట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లోక్ భవన్ ను ముట్టడించింది. ఇరు పార్టీల నిరసనలతో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.






