మామిళ్ళపల్లిలో గుప్తనిధుల కలకలం.. పురాతన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో తవ్వకాలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-22 08:31:26  IST  )

వందల ఏళ్ల నాటి ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం సమీప దూరంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించింది.

మామిళ్ళపల్లిలో గుప్తనిధుల కలకలం.. పురాతన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో తవ్వకాలు
X

దిశ, ఉప్పునుంతల: వందల ఏళ్ల నాటి ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం సమీప దూరంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి విషయం బహిర్గతం కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి గ్రామానికి చెందిన నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

గతంలో పాత ఊరు ఉండటం అక్కడున్న ఓ బండ రాయిపై గణేష్ చిత్రం గీసి ఉన్న ఆనవాళ్లు కనిపించడంతో అక్కడ గుప్త నిధులు ఉన్నాయని తవ్వకాలు చేపట్టినట్లు గ్రామస్థులు,పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో తాయతలు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయ లాంటి పూజా వస్తువులు కనిపించడంతో పక్క ప్లాంతో తవ్వకాలు చేపట్టారని తెలుస్తుంది. ఐతే తవ్వకాలు చేపట్టిన ప్రాంతం లోపల బండరాళ్లు తేలడంతో నిధి దొరికిందా.. లేదా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. గతంలో కూడా ఈ ప్రాంతాల్లో ఇలాంటి తవ్వకాలు పలుమార్లు జరిగినట్లు గ్రామస్థులు తెలుపుతున్నారు.

Next Story