విజయ్ అలా అనేసరికి నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను: అనిల్ రావిపూడి

by Mallepaka Hamsa |

ఆయన పిలిచారని తెలిసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. వెంటనే వెళ్లి ఆయనను కలిశాను. ఆయన కారవాన్‌లో దాదాపు 15 నిమిషాల పాటు మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం

విజయ్ అలా అనేసరికి నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను: అనిల్ రావిపూడి
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన భగవంత్ కేసరికి రీమేకా‌గా ‘జన నాయగన్’ రాబోతున్న విషయం తెలిసిందే. విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కావడంతో.. రిమేక్ అయినా భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా జూలై 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి, విజయ్‌తో తనకున్న మరుపురాని అనుభవాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. "హైదరాబాద్‌లో ‘ది గోట్’ షూటింగ్ జరుగుతున్న సమయంలో, ‘భగవంత్ కేసరి’ సినిమా చూసిన తర్వాత విజయ్ గారు నన్ను కలవాల్సిందిగా కబురు పంపారు. ఆయన పిలిచారని తెలిసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. వెంటనే వెళ్లి ఆయనను కలిశాను. ఆయన కారవాన్‌లో దాదాపు 15 నిమిషాల పాటు మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం" అని అనిల్ తెలిపారు.

ఆ భేటీలో విజయ్ మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటూ.. "నేను ‘భగవంత్ కేసరి’ చూశాను, నాకు సినిమా చాలా బాగా నచ్చింది. మీరు చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అందులోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ నా మనసులోనే నిలిచిపోయాయి. అందుకే మిమ్మల్ని స్వయంగా పిలిచి అభినందించాలని అనుకున్నాను అని విజయ్ గారు చెప్పారు. విజయ్ గారిలాంటి పెద్ద స్టార్ నుంచి ఆ మాటలు వినగానే నా రోజే మారిపోయింది, చెప్పలేని సంతోషం కలిగింది. ఆ మీటింగ్ ముగియగానే వెంటనే మహేష్ బాబు గారికి ఫోన్ చేసి ఆ గొప్ప అనుభవాన్ని ఆయనతో పంచుకున్నాను" అని చెప్పుకొచ్చారు. ఇక ‘జననాయగన్’ సినిమా గురించి మాట్లాడుతూ.. మేకర్స్ ‘భగవంత్ కేసరి’ హక్కులను సొంతం చేసుకుని, ఆ సీన్ల ఆధారంగా ఒక కొత్త కథను రూపొందించారని, అయితే ఈ క్రియేటివ్ ప్రక్రియలో తాను భాగం కాలేదని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు

Next Story