నగరం నడిఒడ్డున ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-22 08:36:25  IST  )

కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలతో హైదరాబాద్ నడిఒడ్డున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీక్, రాహుల్ గాంధీని బలవంతంగా అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడికి మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

నగరం నడిఒడ్డున ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలతో హైదరాబాద్ నడిఒడ్డున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీక్, రాహుల్ గాంధీని బలవంతంగా అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడికి మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మరోవైపు ప్రధాని మోడీ ఇంటిముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటూ బీజేపీ నాయకులు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ నాయలకును నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్దనే అడ్డుకోగా, కాంగ్రెస్ నాయకులను ఖైరతాబాద్ సర్కిల్ వద్ద అడ్డుకున్నారు.

ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ను ముట్టడించే ప్రయత్నం చేయగా బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పోలీస్ వాహనాలపైకి ఎక్కి కర్రలు విసురుతూ దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే స్టేట్ కాంగ్రెస్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతుండటంతో వారిని అదుపుచేయడం పోలీసులకు సవాల్ గా మారింది.

Next Story