- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కీ రోల్.. సందీప్ ప్లాన్ అదిరిపోయిందిగా?
ఈ డార్క్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దిశ, సినిమా: ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్లతో పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , త్రిప్తి డిమ్రీ జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభం కాగా.. 40శాతం షూటింగ్ కూడా పూర్తి అయినట్లు ఇటీవల ఓ ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగా తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ డార్క్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ఆమెను కలిసి కథను వినిపించారని, తన పాత్రకున్న ప్రాధాన్యత నచ్చడంతో కత్రినా కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందట. అయితే, సినిమాలో కత్రినా కైఫ్ పాత్రకు సంబంధించి రెండు రోజుల షూటింగ్ పరిధిలో మాత్రమేనని వార్తలు వస్తున్నాయి. అలా అని ఇది కేవలం మెరుపులా వచ్చి వెళ్లే క్యామియో రోల్ కాదని.. మొత్తం కథనే పూర్తిగా మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్ర అని సమాచారం. నిడివి తక్కువైనా కథలో ఆ పాత్ర తెచ్చే ట్విస్ట్ అద్భుతంగా ఉండటంతో కత్రినా వెంటనే ఒప్పుకుందట. గతంలో ‘ఖుషి’ సినిమాలో ఎస్.జె. సూర్య కేవలం ఒక్క నిమిషం పాత్రతోనే కథను మలుపు తిప్పినట్లు.. సందీప్ కూడా ‘స్పిరిట్’లో కత్రినా పాత్రతో అలాంటి మ్యాజిక్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో సందీప్ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందని, ప్రభాస్-కత్రినా కాంబో స్క్రీన్ పై ఒక రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఖుషీ అవుతున్నారు.






