- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఆర్‌ఎక్స్ 100' చూసిన తర్వాత మహేష్ బాబు అలా అన్నారు.. అజయ్ భూపతి ఆసక్తికర వ్యాఖ్యలు
'ఆర్‌ఎక్స్ 100' తర్వాత మహేష్ బాబు తనను పిలిచి కథ చెప్పమని అడిగారని అజయ్ భూపతి వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు అజయ్ భూపతి 'ఆర్‌ఎక్స్ 100' చిత్రంతో దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, అజయ్ భూపతికి దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా నటించిన 'శ్రీనివాస మంగాపురం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న అజయ్ భూపతి, 'ఆర్‌ఎక్స్ 100' తర్వాత జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు.
అజయ్ భూపతి మాట్లాడుతూ.. 'ఆర్‌ఎక్స్ 100' విడుదలైన తర్వాత మహేష్ బాబు గారు నన్ను పిలిచారు. మొదట ఆయన సినిమా చూసి అభినందించడానికి పిలిచారనుకున్నాను. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఒక మంచి కథ చెప్పమని అడిగారని తెలిపారు. దాంతో అక్కడికక్కడే శ్రీకృష్ణదేవరాయలు మరియు హంపి చుట్టూ ఉన్న రహస్యాలు, మిస్టరీల ఆధారంగా ఓ కథను వినిపించాను. ఆ కథ విన్న మహేష్ బాబు, దాన్ని నా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఉంచుకోవాలని సూచించారు. అలాగే తన కోసం మాత్రం ఒక కమర్షియల్ కథతో రావాలని చెప్పారని అజయ్ భూపతి వెల్లడించారు. ప్రస్తుతం అజయ్ భూపతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






