‘మారెమ్మ’ రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ మేకర్స్.. పవర్ ఫుల్ పోస్టర్‌ విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-22 07:08:11  IST  )

‘మారెమ్మ’ తల్లి దీవెనలతో రాబోయే సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘మారెమ్మ’ రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ మేకర్స్..  పవర్ ఫుల్ పోస్టర్‌ విడుదల
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. వాస్తవ ఘటనల ఆధారంగా, తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు దేవతలపై ప్రజలకు ఉండే నమ్మకాల నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తుండగా, మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బంగారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా వెల్లడించారు. ‘మారెమ్మ’ తల్లి దీవెనలతో గణేష్ చతుర్థి వీకెండ్ సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

రక్తం, నమ్మకం, త్యాగాలతో కూడిన ఒక నిర్భయమైన కథ మిమ్మల్ని ఒక గొప్ప భావోద్వేగ ప్రయాణానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది" అని తెలుపుతూ మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. విడుదలైన పోస్టర్‌లో మాధవ్ రగ్డ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. రెండు కొండల మధ్య ఆకాశంలో దున్నపోతుతో తీవ్రంగా పోరాడుతున్నట్లు ఉండగా, మరో పోస్టర్‌లో ముఖమంతా రక్తంతో, తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు కనిపించి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇక ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతాన్ని అందిస్తుండగా, దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, రూపాలక్ష్మి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రవితేజ కుటుంబం నుంచి వస్తున్న మరో యంగ్ హీరో కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి ఆసక్తి నెలకొంది.

విడుదలకు సిద్ధమైన ‘మకుటం’ సినిమా.. సూర్యకు పోటీగా బరిలోకి దిగనున్న విశాల్!

Next Story