విడుదలకు సిద్ధమైన ‘మకుటం’ సినిమా.. సూర్యకు పోటీగా బరిలోకి దిగనున్న విశాల్!

by Mallepaka Hamsa |

ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

విడుదలకు సిద్ధమైన ‘మకుటం’ సినిమా.. సూర్యకు పోటీగా బరిలోకి దిగనున్న విశాల్!
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మకుటం’. తమిళంలో ‘మగుడం’ పేరుతో రాబోతుంది. ఈ సినిమాతో విశాల్ దర్శకుడిగా తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టడం విశేషం. అంతేకాకుండా ఇందులో ఆయన త్రీపాత్రిభినయం అంటే మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఆర్‌.బి. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ మరియు గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, స్టార్ హీరో సూర్య, ‘సర్కార్ వారి పాట’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం కూడా ఆగస్టు 14నే విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఆగస్టు 14 రేసులో ఈ రెండు సినిమాలు పోటీ పడితే, బాక్సాఫీస్ వద్ద విశాల్, సూర్య మధ్య భారీ ఫైట్ జరగడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story