- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడంగల్ లో నాపై కుట్ర చేస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
తనపై బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ తప్పులు ప్రశ్నిస్తున్నానని కొడంగల్‍లో నన్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు వేరు కావొచ్చు కానీ వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటేనన్నారు. నన్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‍కు ఓట్లు వేసినవాళ్ల ఓట్లు తొలగిస్తున్నారని, కొడంగల్‍లో నాపై కుట్రలు చేసినవాళ్లను ఇక్కడి ప్రజలు తిప్పికొట్టాలన్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్‍లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి.. ఇవాళ తన ఎస్ఐఆర్ ఫామ్ నింపి అధికారులకు ఇచ్చారు. అనంతరం కొడంగల్‍లో ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఏలను ఉద్దేశించి ప్రసంగించారు.
రోజుకు 18 గంటలు సరిపోవడం లేదు:
రాష్ట్రం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా నాకు సమయం సరిపోవట్లేదన్నారు. ప్రతిపేదవాడికి మంచి చేసేందుకు కృషి చేస్తున్నామని కొడంగల్ లో 78 శాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఓటు లేని మనిషి చచ్చిపోయిన వారితో సమానం అన్నారు. ఓటరు జాబితాలో లేకపోతే ప్రభుత్వ పథకాలు రావని చెప్పారు. అందువల్ల అందరూ ఎస్ఐఆర్ నింపి ఓటు హక్కును కాపాడుకోవాలన్నారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేతలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా కొడంగల్‍లో పార్టీ నేతలతో కలిసి సీఎం ధర్నా ర్యాలీలో పాల్గొన్నారు.






