- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ‘తల్లికి వందనం’ నిధుల విడుదల: తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ
ఏపీలో ‘తల్లికి వందనం’ నిధుల విడుదల. 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున జమ చేస్తున్న ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' (Talliki Vandanam) పథకం నిధులను విడుదల చేసింది. విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో విద్యా సంవత్సరం (academic year) ప్రారంభంలోనే నిధులను జమ చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Education Minister Nara Lokesh) తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 42.70 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేస్తుంది. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున చేరుతుండగా, ఈ ఆర్థిక సహాయ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగనుంది.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సోషల్ మీడియా (X) వేదికగా స్పందిస్తూ "పిల్లలే మన సంపద, వారి చదువులే తరగని ఆస్తి" అని పేర్కొన్నారు. గతంలో లాగా కాకుండా, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ పథకం ప్రయోజనాలను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని, పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికీ తన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు.






