- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరీక్ష రద్దయితే నిరాశపడొద్దు.. విద్యార్థులకు రీ-నీట్ AIR 2 టాపర్ పాన్షుల్ బన్సాల్ సందేశం
పరీక్ష రద్దయినప్పుడు బాధపడకుండా రీ-నీట్‌ను అవకాశంగా మార్చుకుని AIR 2 సాధించిన పాన్షుల్ బన్సాల్; విద్యార్థులకు ఓర్పు ఉండాలని పిలుపు.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ వ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అంశంపై తీవ్ర ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రీ-నీట్ AIR 2 టాపర్ పాన్షుల్ బన్సాల్ విద్యార్థులకు కీలక సందేశాన్ని ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం జాతీయ మీడియాతో మాట్లాడని ఆయన విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తొలిసారి పరీక్ష రద్దయినప్పుడు తీవ్ర నిరాశ, బాధకు గురయ్యానని, కానీ ఏడ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించి వెంటనే తేరుకున్నానని ఆయన తెలిపారు. దేవుడు మనకి మరింత మంచి స్కోర్ సాధించేందుకు ఇచ్చిన అవకాశంగా రీ-నీట్‌ను భావించి, మునుపటి కంటే మరింత దృష్టి సారించి ప్రిపరేషన్ కొనసాగించినట్లు వెల్లడించారు. ఈ కష్ట సమయంలో తన కుటుంబం కొండంత అండగా నిలిచి ప్రోత్సహించిందని చెప్పారు.
ఈ సందర్భంగా దేశంలోని ఇతర విద్యార్థులకు సందేశమిస్తూ.. "పరీక్ష నిర్వహణ మన చేతుల్లో ఉండదు, కాబట్టి జరిగేదంతా మన మంచికే అనుకోవాలి. రీ-ఎగ్జామ్‌ను ఒక అవకాశంగా తీసుకుని అంతకంటే మంచి ప్రతిభ కనబరచడానికి ప్రయత్నించాలి" అని హితవు పలికారు. ముఖ్యంగా పరీక్ష రద్దయినప్పుడు నిరాశతో వదిలేయకుండా ఓర్పు, సహనంతో నిలబడడం అత్యంత ముఖ్యమని పాన్షుల్ బన్సాల్ విద్యార్థులకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.






