- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాటర్ ట్యాంకర్ ఢీకొని యువకుడు దుర్మరణం
వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ టోల్‌గేట్ సమీపంలో జరిగింది.

దిశ, గండిపేట: వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ టోల్‌గేట్ సమీపంలో జరిగింది. ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన సుశీల్ కుమార్(28), సురేష్ లక్ష్మిగూడ (కాటేదాన్)లో నివాసముంటూ వడ్రంగి పనులు చేస్తున్నారు. మంగళవారం రాత్రి హాఫీజ్‌పేట్‌లో పని ముగించుకుని హోండా షైన్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా పుప్పాలగూడ టోల్‌గేట్ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న సుశీల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, బైక్ నడుపుతున్న సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అదుపు తప్పిన ట్యాంకర్ మరో కారు, స్కూటీని కూడా ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ రంజిత్ సింహా పై నార్సింగి పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.






