- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అస్సాంలో వరదల బీభత్సం.. ఒక్కరోజే 21 మంది మృతి
అస్సాంలో భయంకరమైన వరదలు: ఒక్కరోజే 21 మంది మృతి, 16 జిల్లాల్లో 5.64 లక్షల మందిపై తీవ్ర ప్రభావం.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో ఈశాన్య రాష్ట్రం అయిన అస్సాంలో గత మూడు రోజులుగా కుండపోత వర్షాలు (Torrential rains) కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు రావడంతో పరిస్థితులు అత్యంత భయాందోళన కారణంగా మారాయి. గత 24 గంటల్లో వరదల ధాటికి ఒక్కరోజే 21 మంది ప్రాణాలు కోల్పోవడంతో, ఈ ఏడాది వరదల్లో మరణించిన వారి మొత్తం సంఖ్య 31కి చేరినట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ASDMA) వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో దాదాపు 5.64 లక్షల మంది ప్రజలు భారీ వర్షాలతో ఏర్పడిన వరదలకు బాధితులుగా మారారని అర్ధరాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేశారు.
ఈ వరద ప్రభావం తీవ్రంగా ఉన్న శివసాగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 13 మంది మరణించగా, చరాయిదేవ్‌లో 5, గోలాఘాట్‌లో ఇద్దరు, జోర్‌హాట్‌లో ఒకరు మృతి చెందారు. నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు నీటమునిగాయి. సమాచార, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.






