‘లెనిన్’ హిట్‌తో మారిన దర్శకుడి రేంజ్.. కోలీవుడ్ స్టార్ హీరోతో కొత్త సినిమా?

by Mallepaka Hamsa |

మురళీ కిషోర్ ఒక పవర్ ఫుల్ రూరల్ బ్యాక్‌డ్రాప్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం.

‘లెనిన్’ హిట్‌తో మారిన దర్శకుడి రేంజ్.. కోలీవుడ్ స్టార్ హీరోతో కొత్త సినిమా?
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్, దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు కాంబినేషన్‌లో వచ్చిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ఏకంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ భారీ బ్లాక్‌బస్టర్ విజయంతో దర్శకుడు మురళీ కిషోర్ టాలీవుడ్‌లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ‘లెనిన్’ సినిమాతో తన సత్తా చాటుకున్న ఈ యువ దర్శకుడు.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. 'సార్', 'కుబేర' వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ధనుష్, ఒకవైపు నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

అయితే ధనుష్ ఇమేజ్ మాస్ ఫాలోయింగ్‌కు తగినట్లుగా మురళీ కిషోర్ ఒక పవర్ ఫుల్ రూరల్ బ్యాక్‌డ్రాప్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. ‘లెనిన్’ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పైనే ఈ భారీ చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు టాక్. టాలీవుడ్‌లో తన సత్తా చాటిన ఈ దర్శకుడు, ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కూడా తన జెండా పాతడానికి సిద్ధమవుతున్నారట. అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ కాంబోలో కనుక సెట్ అయితే.. బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.

Next Story