- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో ప్రధాన మెట్రో స్టేషన్లు మూసివేత.. DMRC కీలక ప్రకటన
భద్రతా కారణాలతో రాజీవ్ చౌక్, జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లను నిలిపివేసిన DMRC.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో సీజేపీ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో అప్రమత్తం అయిన ఢిల్లీ మెట్రో (Delhi Metro) కీలక నిర్ణయం తీసుకుంది. కాక్రోచ్ నిరసనలు భారీగా కొనసాగుతున్న ప్రాంతాల్లో ఉన్న మెట్రో స్టేషన్లు భద్రతా కారణాల దృష్టి మూసివేశారు. ఈ మేరకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని పలు కీలక మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు జన్‌పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సహా మొత్తం 16 మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లలో లైన్లు మారేందుకు (Interchange Facility) వెసులుబాటు అందుబాటులోనే ఉంటుందని అధికారులు వెల్లడించారు. నగరంలో జరుగుతున్న ఆందోళనలు, భద్రతాపరమైన ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు DMRC సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించింది.
- Tags
- Delhi METRO
- DMRC






