- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఓటీ దాడులు.. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్!
by Jakkula.Mamatha |
నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్ విక్రేతను ఎస్ఓటీ పోలీసులు పోచారం పిఎస్ పరిధి మక్తలో దాడి చేసి పట్టుకున్నారు.

X
దిశ, ఘట్కేసర్: నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ విక్రేతను ఎస్ఓటీ పోలీసులు పోచారం పిఎస్ పరిధి మక్తలో దాడి చేసి పట్టుకున్నారు. ఈరోజు(బుధవారం) ఉదయం ఎస్ఓటీ ఉప్పల్ బృందం పక్కా సమాచారంతో పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్తలో దాడులు నిర్వహించగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ సీసాలను అక్రమంగా విక్రయిస్తున్న ముంత రంగయ్య యాదవ్ అనే వ్యక్తిని పట్టుకుని ఐదు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేసు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పాల ఉత్పత్తి కోసం పాలిచ్చే పశువులపై ఉపయోగించే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల తయారీ, అమ్మకాలను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.
Next Story






