పార్లమెంట్‌లో నల్ల దుస్తుల్లో ప్రతిపక్ష ఎంపీల నిరసన

by Malleboina Mahesh |   (  Updated:2026-07-22 05:53:27  IST  )

విద్యార్థుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, ధర్మేంద్ర ప్రధాన్ కొనసాగింపునకు నిరసనగా పార్లమెంట్ ప్రాంగణంలో నల్ల దుస్తుల్లో ప్రతిపక్ష ఎంపీల ధర్నా.

పార్లమెంట్‌లో నల్ల దుస్తుల్లో ప్రతిపక్ష ఎంపీల నిరసన
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలకు, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష (ఇండియా కూటమి) ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ వేదికగా ప్రతిపక్ష నేతలందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా (Pawan Khera) మీడియా (ANI)తో మాట్లాడుతూ.. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తామంతా నల్ల దుస్తులు ధరించామని తెలిపారు. దేశంలోని విద్యార్థులపై అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకపోవడం, విమర్శలు వెల్లువెత్తుతున్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవిలో కొనసాగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

CJP ఆందోళనలపై ఢిల్లీ పోలీసుల కఠిన చర్యలు: వివిధ పోలీస్ స్టేషన్లలో 10 FIRలు నమోదు

Next Story