- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CJP ఆందోళనలపై ఢిల్లీ పోలీసుల కఠిన చర్యలు: వివిధ పోలీస్ స్టేషన్లలో 10 FIRలు నమోదు
ఢిల్లీలో CJP ఆందోళనల్లో ఉద్రిక్తత, హింస నేపథ్యంలో పోలీసులు 10 FIRలు నమోదు చేసి, 250కి పైగా వీడియోలతో దర్యాప్తు చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌తో న్యూఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు ఉద్రిక్తతకు దారితీయడంతో ఢిల్లీ పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 10 ఎఫ్.ఐ.ఆర్ (FIR)లు నమోదు చేశారు. న్యూఢిల్లీ జిల్లా పరిధిలో శాంతిభద్రతల ఉల్లంఘన, రాళ్లు రువ్వడం, సార్వజనిక ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో 4, కాన్‌నాట్ ప్లేస్‌లో 3, అలాగే మందిర్ మార్గ్, బారాఖంబా రోడ్, కర్తవ్య పత్ స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించి, నిరసనకారులు హింసాత్మక ప్రవర్తన కనబరిచారని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారని వెల్లడించారు. ఈ నిరసన వెనుక ముందస్తు కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, నిందితులను గుర్తించేందుకు దాదాపు 250కి పైగా వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే నిరసన పేరుతో ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
మోడీని కాల్చిపరేస్తా.. సీజేపీ నిరసనలో బూతులతో రెచ్చిపోయిన యువకుడు
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. కేంద్రానికి సీజేపీ జాతీయ ప్రతినిధి వార్నింగ్






