- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. కేంద్రానికి సీజేపీ జాతీయ ప్రతినిధి వార్నింగ్
ఢిల్లీలో సిజెపి (CJP) తీవ్ర హెచ్చరిక: 20న జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఎఫ్‌ఐఆర్‌లు రద్దు చేయకపోతే కోట్లాదిమందితో ఢిల్లీని ముట్టడిస్తామని ప్రకటన.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సాగుతున్న సీజేపీ నిరసనలు, ఉద్రిక్తతలు, హింసపై సీజేపీ జాతీయ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి, యువజన ఉద్యమం స్వాతంత్ర్యానంతర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద పోరాటంగా రూపుదిద్దుకుంటోందని అశుతోష్ రంకా వ్యాఖ్యానించారు. ఈ నెల 20న జరిగిన నిరసన కేవలం ఒక ‘ట్రైలర్’ మాత్రమేనని, ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువకులు ఢిల్లీకి తరలివస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యువత ఆగ్రహానికి గురికాక ముందు ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
గత 31 రోజులుగా గాంధీ, అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, అయితే పోలీసులు దౌర్జన్యంగా దాడులు చేసి విద్యార్థులను కొట్టడం వల్లే ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని ఆయన ఆరోపించారు. నిరసనకారులపై నమోదైన కేసులను (FIRs) ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన విరమించేది లేదని సీజేపీ నేత అభిజీత్ దీప్కే స్పష్టం చేసినట్లు తెలిపారు. తాము యుఎపిఎ (UAPA), ఎన్ఎస్ఎ (NSA) వంటి కఠిన చట్టాల కింద అరెస్టు కావడానికి, జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్ సమంజసమైనదని, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అశుతోష్ రంకా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మోడీని కాల్చిపరేస్తా.. సీజేపీ నిరసనలో బూతులతో రెచ్చిపోయిన యువకుడు
CJP ఆందోళనలపై ఢిల్లీ పోలీసుల కఠిన చర్యలు: వివిధ పోలీస్ స్టేషన్లలో 10 FIRలు నమోదు






