- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ధర్నా
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల అరెస్ట్‌ను నిరసిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు మహా ధర్నా నిర్వహించాయి.

దిశ, హుస్నాబాద్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల అరెస్ట్‌ను నిరసిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు మహా ధర్నా నిర్వహించాయి. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మంత్రి పొన్నం తీవ్రంగా మండిపడ్డారు.
నీట్ (NEET) పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని, బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని, కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలన్నారు. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఢిల్లీ హింసపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.






