షూటింగ్ ప్రారంభం కాకముందే 'D56'కు భారీ డీల్.. రికార్డు సృష్టించిన ధనుష్

by Pulgam srinivas |

సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్న 'D56'కు అంతకుముందే భారీ OTT డీల్ కుదిరినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

షూటింగ్ ప్రారంభం కాకముందే D56కు భారీ డీల్.. రికార్డు సృష్టించిన ధనుష్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం 'D56' అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నప్పటికీ, అంతకుముందే డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

ఇటీవల కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తయినా కూడా ఓటీటీ ఒప్పందాలు కుదరడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 'D56' మాత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే భారీ డిజిటల్ డీల్‌ను సొంతం చేసుకోవడం విశేషంగా మారింది. ఈ డీల్‌తో ధనుష్ మరోసారి తన మార్కెట్‌ను నిరూపించుకున్నారని, 'D56' ఓటీటీ హక్కుల విషయంలో కొత్త రికార్డు నమోదైందని కోలీవుడ్ మీడియా పేర్కొంటోంది. ఇక ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటించనున్నారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. అయితే సాయి పల్లవి, రుక్మిణి వసంత్, సారా అర్జున్ పేర్లు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.

Next Story