Kiran Abbavaram: 'SYG' నేను చేయాల్సిన సినిమానే.. కానీ ఆ కారణంతో వదులుకున్నా

by Pulgam srinivas |

దాదాపు 80 కోట్ల బడ్జెట్ అవుతుందని 'SYG' చిత్రాన్ని వదులుకున్నట్లు కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.

Kiran Abbavaram: SYG నేను చేయాల్సిన సినిమానే.. కానీ ఆ కారణంతో వదులుకున్నా
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆయన వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అందులో కిరణ్ అబ్బవరంకి ఇటీవల మీరు పలు సినిమాలను వదులుకున్నట్లు అందులో కొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అది నిజమేనా? అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఈ నటుడు ... అవును, నేను కొన్ని సినిమాలను వదులుకున్నాను. అందులో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.

అయితే అందుకు ప్రధాన కారణం నా మార్కెట్ పరిధి. నా మార్కెట్‌కు తగ్గ బడ్జెట్‌లోనే సినిమా చేయాలని నేను భావిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు రోహిత్ గురించి మాట్లాడుతూ.. "రోహిత్ నాకు చాలా కాలంగా తెలుసు. అతనిలో మంచి టాలెంట్ ఉందని నేను అప్పుడే గుర్తించాను. మొదట అతను నాకు చెప్పిన కథను రెండు, మూడు కోట్ల రూపాయల బడ్జెట్‌లో పూర్తి చేయవచ్చు. కానీ అంత టాలెంట్ ఉన్న నువ్వు ఇంత చిన్న సినిమా చేయొద్దని నేను చెప్పాను.

తర్వాత అతను భారీ స్థాయిలో రూపొందించిన 'సంబరాల ఏటిగట్టు (SYG)' కథను వినిపించాడు. అయితే ఆ సినిమా బడ్జెట్ రూ.70–80 కోట్ల వరకు ఉంటుందని తెలిసిన తర్వాత, నా మార్కెట్‌కు అది సరిపోదని నేనే చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని వివరించారు. అలాగే, ఆ తర్వాత ఆ సినిమాకు సాయి దుర్గ తేజ్‌ను (సాయి ధరమ్ తేజ్) ఎంపిక చేయాలని అనుకున్నారని తెలిసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయనకు పెద్ద మార్కెట్ ఉంది. ఆ సినిమా ఆయనతో బాగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాను. 'సంబరాల ఏటిగట్టు' సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కిరణ్ అబ్బవరం తెలిపారు.

Next Story