- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి.. ఇద్దరికి గాయాలు
బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వలస వచ్చిన కూలీ బైక్ అదుపుతప్పి కింద పడి మృతి చెందిన ఘటన బతికేపల్లి గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది.

దిశ, పెగడపల్లి: బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వలస వచ్చిన కూలీ బైక్ అదుపుతప్పి కింద పడి మృతి చెందిన ఘటన బతికేపల్లి గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన ఇసుకదిన్నెల శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి గొల్లపల్లి మండలం రంగధముని పల్లి గ్రామానికి వలస వచ్చి మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు పనిలో భాగంగా తన కుమారుడు హేమంత్ మరో ఇద్దరు కూలీలతో పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా బతికేపల్లి పాత బ్రిడ్జి వద్ద వారి బైక్ అదుపుతప్పి కింద పడగా హేమంత్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరిలో ఒకరి కాలు వీరగ్గా మరొకరి తలకి గాయం కాగా ఆసుపత్రికి తరలించామని వారి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలిపారు. మృతుడు హేమంత్ తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. కాగా ఎక్కడో పుట్టి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి ఇలా మృతి చెందడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.






