సంగారెడ్డిలో విద్యాసంస్థల బంద్

by Jakkula.Mamatha |

ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో సంగారెడ్డిలో నేషనల్ హైవేను కాంగ్రెస్ నేతలు దిగ్బంధించారు.

సంగారెడ్డిలో విద్యాసంస్థల బంద్
X

దిశ, సంగారెడ్డి: ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో సంగారెడ్డిలో నేషనల్ హైవేను కాంగ్రెస్ నేతలు దిగ్బంధించారు. పోతిరెడ్డిపల్లి వద్ద హైదరాబాద్-ముంబై నేషనల్ హైవే పై తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ వర్షంలోనూ కాంగ్రెస్ నేతల ఆందోళన కొనసాగింది. కాంగ్రెస్ అగ్రనాయకుల అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ నేతలంతా రోడ్డుపై బైఠాయించారు.

అనంతరం టైర్లను తగలబెట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాంగ్రెస్ శ్రేణులు పోలీసులు తీవ్ర తోపులాట అనంతరం జగ్గారెడ్డిని పోలీసు వాహనంలో అరెస్టు చేసి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులంతా పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు. కార్యకర్తలకు పోలీసులకు తీవ్ర తోపులాట అనంతరం పోలీసులు జగ్గారెడ్డిని అరెస్ట్ చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

విద్యాసంస్థలు బంద్..

ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులను ఖండిస్తూ బుధవారం సంగారెడ్డి పట్టణంలోని అన్ని విద్యాసంస్థల బంద్‌కు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జగ్గారెడ్డి ఇచ్చిన బంద్ పిలుపుతో సంగారెడ్డిలోని అన్ని విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశాయి.

Next Story