తెలంగాణలో కొనసాగుతున్న ముసురు.. ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందంటే?

by Ajay Maddhiboyina |

తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి చిరుజల్లులు కురుస్తున్నాయి.

తెలంగాణలో కొనసాగుతున్న ముసురు.. ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి చిరుజల్లులు కురుస్తున్నాయి. కాగా నేడు సైతం రాష్ట్రానికి వర్షసూచన ఉన్నట్టు వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. మరోరోజు ముసురు కొనసాగుతుందని తెలిపారు. ఉత్తర, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో మబ్బులతో కూడిన వాతావరణం కనిపిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆదిలాబాద్, అసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రి సమయంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. అదేవిధంగా సెంట్రల్ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణతెలంగాణ జిల్లాల్లో సాయంత్రం సమయంలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సాయంత్రం నుండి రాత్రి వరకు చినుకులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

Next Story