- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న క్యాబిన్ క్రూపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం.. నిందితుడి అరెస్ట్!
ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న ఓ మహిళా క్యాబిన్ క్రూపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న ఓ మహిళా క్యాబిన్ క్రూపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జులై 20న మధ్యాహ్నం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన ఓ క్యాబిన్ క్రూ ప్రయాణిస్తున్న క్యాబ్‌ను డ్రైవర్ మార్గమధ్యంలో దారి మళ్లించాడు. అండర్ కన్స్ట్రక్షన్‌లో ఉన్న సాంక్టా మారియా స్కూల్ సమీపంలో వాహనాన్ని ఆపి టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి కాసేపటి తర్వాత తిరిగి వచ్చి వెనుక సీటులో ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితుడు ఎర్రపోగు ప్రశాంత్ కుమార్(23)ను సిద్ధాంతిలో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు తరలించారు.






