- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పసిడి ప్రియులకు భారీ షాక్: రూ. 1.46 లక్షలు దాటిన బంగారం ధర!
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 2,290 మేర పెరిగి రూ. 1,46,510 మార్కుకు చేరుకుంది.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా రూ. వెయ్యి లోపు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు (gold price) బుధవారం రోజు పసిడి ప్రియులకు తీవ్ర షాక్ ఇచ్చాయి. దేశీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 2,290 మేర పెరిగి రూ. 1,46,510 మార్కుకు చేరుకుంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేటు కూడా రూ. 2,100 పెరిగి రూ. 1,34,300 వద్ద నిలిచింది. పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తుండటంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అలాగే మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగి అంబరాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ. 2,40,000 మార్కును తాకి వినియోగదారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అషాడమాసం వేళ బంగారం, వెండి ధరలు ఇలా ఆకాశాన్నంటడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, మార్కెట్ తీవ్రతల వల్లే ఈ స్థాయిలో ధరల పెరుగుదల నమోదవుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.






