జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. అమ్మాయే ఫోర్స్ చేసిందంటూ యువకుడి వీడియో

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-22 04:01:33  IST  )

విజయవాడలో జిమ్ ట్రైనర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసుకు ఫిర్యాదు చేసిన ఘటన సంచలనంగా మారింది. స్లిమ్ చేస్తానంటూ దగ్గరై మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి, నగ్న ఫోటోలు తీసినట్టు యువతి ఆరోపించింది.

జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. అమ్మాయే ఫోర్స్ చేసిందంటూ యువకుడి వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో జిమ్ ట్రైనర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసుకు ఫిర్యాదు చేసిన ఘటన సంచలనంగా మారింది. స్లిమ్ చేస్తానంటూ దగ్గరై మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి, నగ్న ఫోటోలు తీసినట్టు యువతి ఆరోపించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఇన్ స్టాలో పరిచయమైన అబ్దుల్ ఖాదర్ సన్నగా అయ్యేందుకు టిప్స్ చెబుతానని దగ్గరయ్యాడని యవతి ఫిర్యాదులో పేర్కొంది. తరవాత హోటల్ కు తీసుకువెళ్లి బరువు తగ్గేందుకు షేక్ తాగాలంటూ మత్తుమందు ఇచ్చాడని ఆరోపించింది. యువతి ఫిర్యాదుతో ట్రైనర్ పరార్ అవ్వగా తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి సంచలన ఆరోపణలు చేశాడు.

ఆ అమ్మాయే తనను మోసం చేసిందని ట్రైనర్ చెబుతున్నాడు. తనను ట్రాప్ చేసి, క్యాన్సర్ ఉందని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పాడు. రూంకు తీసుకెళ్లి మద్యం తీసుకురావాలని తనకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసిన ఆధారాలు ఉన్నాయని అన్నాడు. తన కూతురుకు క్యాన్స‌ర్ ఉంద‌ని, ఆమె కోరిక తీర్చాల‌ని యువతి త‌ల్లి కూడా తనకు ఫోన్ చేసి రూంకు వెళ్లాలని చెప్పిందన్నారు. యువ‌తి ప్ర‌వ‌ర్త‌న అనుమానంగా ఉండ‌టంతో దూరం పెట్టిన త‌ర‌వాత త‌న‌పై త‌ప్పుడు కేసులు పెట్టార‌ని చెప్పాడు. య‌వతి త‌ల్లి, ఆమె తండ్రి డ‌బ్బుల కోసం బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, వేధింపుల‌తో ఆత్మ‌హ‌త్యకు సిద్ధం అయ్యాన‌ని చెప్పాడు. త‌న‌వ‌ద్ద ఉన్న అన్ని ఆధారాల‌ను పోలీసుల ముందు పెడ‌తాన‌ని చెప్పాడు.

Next Story