శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ.. నిన్న హుండీ ఆదాయం రూ. 5.18 కోట్లు

by Malleboina Mahesh |

తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. బుధవారం తెల్లవారు జామునే శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ.. నిన్న హుండీ ఆదాయం రూ. 5.18 కోట్లు
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం (Tirumala Kshetra)లో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. బుధవారం తెల్లవారు జామునే శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో, మిగిలిన భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల్లో టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది.

ఇదిలా ఉంటే తిరుమలలో నిన్న రోజంతా భక్తుల రాక విశేషంగా సాగి.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం చేకురింది. నిన్న ఒక్కరోజే మొత్తం 82,105 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వారిలో 34,484 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న హుండీ ఆదాయం రూ. 5.18 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది.

Next Story