ఏసీబీ దాడుల కలకలం.. టీజీ రెడ్కో డీఈ వెంకటరమణ ఇంట్లో సోదాలు

by Malleboina Mahesh |

టీజీ రెడ్కో డీఈ వెంకటరమణ కు చెందిన నివాసాల్లో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు.

ఏసీబీ దాడుల కలకలం.. టీజీ రెడ్కో డీఈ వెంకటరమణ ఇంట్లో సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఏసీబీ అధికారులు (ACB officials) ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున టీజీ రెడ్కో డీఈ వెంకటరమణ (TG Redco DE Venkataramana)కు చెందిన నివాసాల్లో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. ప్రస్తుతం మాదాపూర్ లోని ఆయన నివాసం తో పాటు 10 ప్రాంతాల్లో ఏక కాలంలో ఈ దాడులు జరగ్గా.. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఆకస్మిక దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story