'చెన్నై లవ్ స్టోరీ' ఫస్ట్ ప్రీమియర్ అక్కడే

by Pulgam srinivas |

'చెన్నై లవ్ స్టోరీ' వరల్డ్ ఫస్ట్ ప్రీమియర్ షోను తిరుపతిలోని పీజీఆర్ సినిమాస్‌లో జూలై 23న ప్రదర్శించనున్నారు.

చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ ప్రీమియర్ అక్కడే
X

దిశ, వెబ్ డెస్క్: యువ నటుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా జులై 24వ తేదీన విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ ఫస్ట్ ప్రీమియర్ షోను తిరుపతిలో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. జూలై 23వ తేదీ సాయంత్రం 7:02 గంటలకు తిరుపతిలోని పీజీఆర్ సినిమాస్లో ఈ ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమైనట్లు మేకర్స్ వెల్లడించారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించగా, సామ్ సీఎస్ సంగీతాన్ని అందించారు. విడుదలకు ముందే వరల్డ్ ఫస్ట్ ప్రీమియర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తిని మరింత పెంచుతోంది.




Next Story