- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల పేరుతో రాహుల్ గాంధీ రాజకీయాలు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
విద్యార్థుల పేరుతో రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని, నీట్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధమని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రస్థాయిలో (Union Education Minister Dharmendra Pradhan in critical condition) మండిపడ్డారు. విద్యార్థుల పేరును వాడుకుని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్వంత రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కేవలం రాజకీయ ప్రచారం కోసమే దేశంలోని విద్యార్థులను అడ్డు పెట్టుకోవడం ఎంత మాత్రం సరైంది కాదని హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా, వారి పట్ల ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
నీట్ (NEET) పరీక్ష అంశంపై పార్లమెంట్‌లో గానీ, బయట గానీ సమగ్రమైన చర్చ జరపడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటనలో తెలిపారు. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను ఈ సందర్భంగా ఆయన తోసిపుచ్చారు.






