మర్కోడు ఎంపీపీ స్కూల్ ప్రహరీ నిర్మాణంలో అనుమానాలు

by Jakkula.Mamatha |

మండల పరిధిలోని మర్కోడు గ్రామ పంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

మర్కోడు ఎంపీపీ స్కూల్ ప్రహరీ నిర్మాణంలో అనుమానాలు
X

దిశ, ఆళ్లపల్లి: మండల పరిధిలోని మర్కోడు గ్రామ పంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ పనులకు ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏఈ ఇటీవలే బదిలీ అయ్యారు. అయినప్పటికీ ఆయనే పనులను పూర్తి చేస్తున్నారని పాఠశాల హెచ్ఎం రామకృష్ణ తెలిపారు. ట్రాన్స్ఫర్ అయిన అధికారి పనులు ఎలా చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. కాంట్రాక్టర్ జాడ కరువు ప్రభుత్వ పనులను కాంట్రాక్టర్ చేయాల్సి ఉండగా, ఈ పనిని కాంట్రాక్టర్ ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టిమేషన్ మొత్తం పూర్తి కాలేదు,అంతేకాకుండా ఎస్టిమేషన్‌లో వచ్చిన మొత్తానికి ప్రహరీ గోడ పూర్తి చేయడం లేదనే సమాచారం కూడా ఉంది. మరి మిగిలిన పనులు ఎప్పుడు పూర్తవుతాయో, నిధులు ఏమయ్యాయో ఎవరికీ అర్థం కావడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story