- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ కొత్త సినిమా
'35 చిన్న కథ కాదు' ఫెమ్ ధీరజ్ మొగిలినేనితో విశ్వక్ సేన్ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో విశ్వక్ సేన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది, తాజా సమాచారం ప్రకారం, '35 చిన్న కథ కాదు' చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ధీరజ్ మొగిలినేని దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని, మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ప్రకటన వచ్చిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక '35 చిన్న కథ కాదు' చిత్రం 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ బాలల చిత్రం అవార్డుతో పాటు, ఇందులో నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ పోతులకు ఉత్తమ బాల నటుడు విభాగంలో జాతీయ అవార్డును అందించింది. దీంతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడితో విశ్వక్ సేన్ సినిమా చేయనున్నాడనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.






