గందరగోళం సృష్టించేందుకు కొందరు గూండాలను పంపారు.. అభిజీత్ దీప్కే షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తప్ప మరెక్కడా సమావేశం కావాలని తాము పిలుపునివ్వలేదని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో గందరగోళం సృష్టించేందుకు కొంద‌రు గూండాల‌ను పంపిన‌ట్టు స‌మాచారం ఉంద‌ని షాకింగ్ కామెంట్లు చేశారు.

గందరగోళం సృష్టించేందుకు కొందరు గూండాలను పంపారు..  అభిజీత్ దీప్కే షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తప్ప మరెక్కడా సమావేశం కావాలని తాము పిలుపునివ్వలేదని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో గందరగోళం సృష్టించేందుకు కొంద‌రు గూండాల‌ను పంపిన‌ట్టు స‌మాచారం ఉంద‌ని షాకింగ్ కామెంట్లు చేశారు. వారితో త‌మ పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని వెల్ల‌డించారు. ఎవ‌రైనా నిర‌స‌నలో పాల్గొనాలి అంటే జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు రావాల‌ని పిలుపునిచ్చారు. తాము ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు చేయ‌మ‌ని తాము దేశ‌భ‌క్తులం అని కేవ‌లం శాంతియుతంగా నిర‌స‌న చేప‌డ‌తామ‌ని చెప్పారు.

నిన్న లాఠీ ఛార్జ్ చేసిన‌ప్ప‌టికీ విద్యార్థులు, కాక్రోచ్ జ‌న‌తాపార్టీ కార్య‌క‌ర్త‌లు ఎలాంటి అసాంఘీక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ‌లేద‌న్నారు. ఎవ‌రైనా ఘ‌ర్ష‌ణ‌ల‌కు పాల్ప‌డితే వారికి కాక్రోచ్ జ‌న‌తాపార్టీతో ఎలాంటి సంబంధంలేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే నీట్ పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ, విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ‌కారుడు సోన‌మ్ వాంగ్ చుక్ చేప‌ట్టిన నిరాహార‌దీక్ష‌తో ఈ ఉద్య‌మం తారాస్థాయికి చేరుకుంది.

Next Story