- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఎస్ఐఆర్‌పై సీఎం ‘స్పెషల్ రివ్యూ'.. l జిల్లా అధికారుల్లో టెన్షన్!
రాష్ట్రవ్యాప్తంగా సంచ లనం సృష్టిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో, దీనిపై ముఖ్యమంత్రి ఏ రే వంత్ రెడ్డి బుధవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ప్ర త్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

దిశ,కొడంగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచ లనం సృష్టిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో, దీనిపై ముఖ్యమంత్రి ఏ రే వంత్ రెడ్డి బుధవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ప్ర త్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జూలై 20వ తేదీ సా యంత్రం నాటికి అందిన అధికారిక గణాంకాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సీఎం నేరుగా క్లాస్ తీసుకోనున్నారనే సమాచారంతో వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారు ల్లో తీవ్ర గుబులు మొదలైంది.
సీఎంవో 'సర్జికల్ సీక్రెట్ రిపోర్ట్'!
ఓటరు సర్వే ప్రక్రియ కేవలం రొటీన్ ఆఫీస్ పని కాదని, రాబోయే రోజు ల్లో ప్రజాప్రతినిధులు, నాయకుల పనితీరుకు ఇది 'రిపోర్ట్ కార్డ్' గా మారుతుందని సీఎం ముందే హెచ్చరించారు.
ఏఎస్‌డీ ఓట్ల తీరుపై ఆరా: వలస వెళ్లిన పేదల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా 'అబ్సెంట్/షిఫ్టెడ్' కిం ద తొలగించారా? లేదా? అనే దాని పై ఇంటెలిజెన్స్ సమాచారంతో సీ ఎం సిద్ధమయ్యారు.
బీఎల్ఏల సమన్వయం: ప్రతి పోలింగ్ బూత్‌లో బీఎల్ఓలతో పాటు పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎంతవరకు సమన్వయం చేసుకున్నారనే దానిపై స్పష్టత తీసుకోనున్నారు.
నిర్లక్ష్యం వహిస్తే.. పదవులు ఊస్ట్
కొడంగల్ నియోజకవర్గంతో పాటు వికారాబాద్, పరిగి, తాండూర్ పరి ధిలో కొత్తగా 18 ఏళ్లు నిండిన యు వత ఓట్ల నమోదు, ఫారాల డిజిటలైజేషన్ ఆలస్యంపై సీఎం సూటిగా బాధ్యులను నిలదీయనున్నారు. కాగితాలపై గణాంకాలు చూపి తప్పించుకుందామనుకుంటే కుదరదని, క్షేత్రస్థాయిలో లోపాలు కనిపిస్తే అ ధికారులతో పాటు పార్టీ ఇన్జార్జులపై చర్యలు తప్పవని సమాచారం.
డిజిటలైజేషన్‌లో వికారాబాద్ ఎక్కడ?
ప్రభుత్వ అధికారిక రిపోర్ట్ ప్రకా రం.. వికారాబాద్ జిల్లాలోని ఓట రు సవరణ వివరాలు మొత్తం ఓట ర్లు 10,17,671. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 10,17,671 (100 శాతం పూర్తి). డిజిటైజ్ అ యిన ఫారాలు 7,30,399 (71. 77 శాతం మాత్రమే). జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయినప్పటికీ, వాటిని ఆన్‌లైన్ సిస్టమ్‌లో డిజిటైజేషన్ చేసే ప్రక్రియ 71.77 శా తానికే పరి మితం కావడంపై సీఎం రేవంత్ రెడ్డి రేపటి సమీ క్షలో తీవ్రంగా ప్రశ్నించే అవ కాశం ఉంది.






