- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, నాగర్ కర్నూల్/తాడూర్: నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు, బస్సు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నాగర్ కర్నూల్ నుంచి ప్రయాణికులతో కల్వకుర్తి వెళ్తుంది. ఈ క్రమంలో గుంతకోడూరు గ్రామం దాటిన తర్వాత కల్వకుర్తి వైపు నుంచి వస్తున్న కారు ముందుగా ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. అప్పటికే కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. బస్సులో ఉన్న 14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బస్సులోని ప్రయాణికులంతా నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం కొండాపూర్‌కు చెందిన శరత్ గౌడ్ కారు శిథిలాల మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇటీవల నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.






